‘ఏజెంట్’ గా సందడి చేయనున్న అక్కినేని వారసుడు

‘ఏజెంట్’ గా సందడి చేయనున్న అక్కినేని వారసుడు

స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి(Surender reddy) దర్శకత్వంలో అఖిల్ అక్కినే(Akhil akkineni)ని నటిస్తోన్న స్పై థ్రిల్లర్ ఏజెంట్. ఈ సినిమా అఖిల్ కెరీర్ కు ఎంతో కీలకంగా మారనుంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.  ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి. 

ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించారు. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా అభిమానులు అఖిల్ కు విషెస్ చెప్తున్నారు. ఈ సినిమాతో తమ హీరో మంచి ఇమేజ్ ను అందుకుంటున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

టాలీవుడ్ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నుంచి ఈ అక్కినేని వారసుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  సమంత సైతం ప్రతి ఏడాది లాగే అఖిల్ ను విష్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్ డే అఖిల్ అంటూ స్మైలీ.. హగ్ సిబల్ ను షేర్ చేసింది. 28న రిలీజ్ కాబోతున్న ఏజెంట్(Agent) కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్టుగా తెలిపింది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటూ ఫైర్ సింబల్ ను జతచేసింది. లాట్స్ ఆఫ్ లవ్ అని పోస్ట్ చేసింది.