ముఖానికి ఆక్సిజన్ పైప్.. సమంతకు అంత సీరియస్ గా ఉందా!

ముఖానికి ఆక్సిజన్ పైప్.. సమంతకు అంత సీరియస్ గా ఉందా!

సమంతకు ఏమైందీ.. ఎందుకు ఇలా ఉంది.. అనారోగ్యం అని తెలుసు కానీ.. మరీ అంత సీరియస్ గా ఉందా.. ముఖానికి వెంటిలేటర్ లాంటి ఆ మాస్క్ ఏంటీ.. ఎందుకు పైపులు పెట్టుకుని ఆక్సిజిన్ పీలుస్తుంది.. మామూలుగా ఊపిరి తీసుకోలేకపోతుందా.. హీరోయిన్ సమంత గురించి ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది అభిమానుల్లో. దీనికి కారణం లేకపోలేదు.. సమంత స్వయంగా విడుదల చేసిన ఫొటో.. ఆ ఫొటోలో ముఖానికి ఆక్సిజన్ పైప్ లు పెట్టుకుని ఉంది.. దీంతో సినీ ఇండస్ట్రీలోనే కాదు.. సమంత ఫ్యాన్స్ మొత్తం దీనిపై ఆందోళనగా ఉన్నారు. ఇంతకీ సమంత అలా కనిపించటానికి కారణం ఏంటీ.. ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకుంటుందో తెలుసుకుందాం.. 

ఈ ఫొటోస్ లో సమంత మొహానికి ఆక్షీజన్ మాస్క్ పెట్టుకొని కనిపించింది. ఇది చుసిన ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ సమంతకి ఏమైంది అంటే. ప్రస్తుతం హైపర్బేరిక్ థెరపీ తీసుకుంటోంది.ఈ థెరఫీ కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుందని, పాడైన కండరాలను బాగుచేస్తుందని సమంత తెలిపింది. గత కొంత కాలంగా సమంత మాయోసైటిస్ వ్యాధితో భాదపడుతున్న సంగతి తెలిసిందే.

ఈమధ్యే ఆవ్యాది నుండి కోలుకొని.. షూటింగ్స్ లో పాల్గొంటోంది. తాజాగా ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా అలసిపోయిందట సమంత. దాంతో.. కొంత అస్వస్థతకి గురైన ఆమె.. ఇందుకోసం తాజాగా హైపర్బేరిక్ థెరపీ ట్రీట్మెంట్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే తీసిన ఫొటోస్ నే సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే.. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని మరో రెండు రోజుల్లో ఆమె డిస్చార్జ్ అవుతుందని వైద్యులు తెలిపారు.