సమంత ఫిట్ నెస్‭కు కారణం ఇదేనా

సమంత ఫిట్ నెస్‭కు కారణం ఇదేనా

చాలామంది ఫిట్‭గా హెల్దీగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు జిమ్‭లో కసరత్తులు చేస్తూ.. ఇష్టమైన ఆహారాన్ని తినకుండా కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. ఇంకొందరు తమకు ఇష్టమైన సెలబ్రిటీల డైట్ ఏంటో తెలుసుకుని వాళ్లు కూడా అదే ఫోలో అయిపోతూ ఉంటారు. కొందరు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తూ ఉంటారు. ఇక సెలబ్రెటీలు అయితే మాత్రం ఎంత బిజీగా ఉన్నా.. తమ ఆరోగ్యం, ఫిట్ నెస్ విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‭గా ఉండే సమంత.. తన ఫిట్ నెస్ కు సంబంధించి  ఓ సీక్రెట్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. తాను హెల్దీగా ఉండేందుకు ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటుందనే విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. 

మూడు పదుల వయసు దాటినప్పటికీ.. తాను ఇప్పటికీ అందంగా.. ఆరోగ్యకరంగా.. ఫిట్‭గా ఉండేందుకు కారణం తాను తీసుకునే ఆహారమని.. అందులోనూ బ్రేక్ ఫాస్ట్ ముఖ్య కారణమని సమంత చెప్పింది. తను తీసుకునే బ్రేక్ ఫాస్టులో పండ్లు, కూరగాయలు కచ్చితంగా ఉండాలని.. అవి తింటే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పింది. వీటితో పాటు కొన్ని గింజలు. విత్తనాలు ఉన్న బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నట్టు తెలిపింది. ఇక తాను ప్రతి రోజు తీసుకునే బ్రేక్ ఫాస్ట్‭లో కచ్చితంగా పిస్తా, చియా విత్తనాలు, స్ట్రాబెర్రీ, అరటిపండు, బాదమ్స్, క్యారెట్ ముక్కలు, సబ్జా గింజలు ఉండేలా చూసుకుంటుంది. ఇవన్నీ ఓ బౌల్‭లో వేసి.. తినడానికి రెడీగా ఉన్నట్లు దాని పిక్ తీసి షేర్ చేసింది. 

కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలలో అనేక మంది ఆహారం తీసుకునే విధానంలో చాలా మార్పు వచ్చింది. చాలా మంది ఇళ్లలోనే ఆహారాన్ని తయారు చేసుకోవడం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమంత ఇన్ స్టాగ్రామ్‭లో తాను రోజువారీ తీసుకునే బ్రేక్ ఫాస్ట్‭ను ఎలా తయారు చేసుకోవాలో వివరించింది. ముందుకు మనకు నచ్చిన పండ్లు, కూరగాయాలు,  గింజలను ఒక బౌల్‭లో తీసుకోవాలి. వాటిని ఒకదానితో ఒకటి బాగా కలపాలి. కొన్ని సబ్జా గింజలను ఫ్రూట్స్, కూరగాయల పైన వేయాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్‭ను కూడా సన్నగా తరిగి పైన వేసుకోవాలి.  అంతే ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ రెడీ అంటూ సమంత తన ఇన్ స్టాలో బ్రేక్ ఫాస్ట్ బౌల్ పిక్ ను షేర్ చేసింది