ఓ బేబీ సమంత నోట ప్రేమ పలుకులు..

ఓ బేబీ సమంత నోట ప్రేమ పలుకులు..

హీరోయిన్ సమంత(Samantha)  మళ్లీ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. తాజాగా సమంత ప్రేమకు సంబంధించి..ఇన్స్‌స్టా లో చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. ' మరణం నుంచి మనల్ని ఏది కాపాడలేదు. కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి ' అని చిలీ రైటర్ పాబ్లో నెరూడా(Pablo Neruda) రాసిన ఒక కోటేషన్ ను షేర్ చేసింది సమంత. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా సమంత ప్రేమలో ఉందంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.

ఇటీవల వచ్చిన మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తుంది. తనకు వచ్చిన వ్యాధి ఎంతో విలువైన జీవితాన్ని నేర్పించింది అంటూ మరి కొంత మంది ఫ్యాన్స్ అభిప్రాయం తెలుపుతున్నారు. కాగా నాగ చైతన్య(Naga Chaitanya)  తో విడాకుల తర్వాత సమంత చేసే ప్రతి పోస్ట్ వెనుకాల ఏదో పెద్ద మీనింగ్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

సమంత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండ( Vijay Devarakonda)  ఖుషి మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులని అలరిస్తుంది. కాగా సమంత గత చిత్రం శాకుంతలం మూవీ అంతగా ఆకట్టుకోలేదు.