V6 News

శాంసన్కు ఐసీసీ మంత్లీ పురస్కారం

శాంసన్కు ఐసీసీ మంత్లీ పురస్కారం

దుబాయ్‌‌‌‌: టీమిండియా రెండోసారి టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్‌‌‌‌ సంజూ శాంసన్‌‌‌‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. మార్చి నెలకుగాను శాంసన్‌‌‌‌ ‘ఐసీసీ మెన్స్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్‌‌‌‌’ అవార్డును గెలుచుకున్నాడు. టోర్నీ ఆరంభంలో బెంచ్‌‌‌‌కే పరిమితమైన శాంసన్‌‌‌‌ కీలకమైన నాకౌట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో తన బ్యాట్‌‌‌‌ పవర్‌‌‌‌ చూపెట్టాడు. 

మార్చిలో ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌ల్లో 137.50 సగటు, 200 స్ట్రయిక్‌‌‌‌ రేట్‌‌‌‌తో 275 రన్స్‌‌‌‌ చేశాడు. ‘నా క్రికెట్‌‌‌‌ ప్రయాణంలో ఇది మర్చిపోలేని ఘట్టం. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ గెలవాలనేది నా కల. ఆ కలను నిజం చేయడంలో నా వంతు పాత్ర పోషించడం గర్వంగా ఉంది. సహచర ప్లేయర్లు, కోచింగ్‌‌‌‌ సిబ్బంది నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు’ అని శాంసన్‌‌‌‌ పేర్కొన్నాడు. విమెన్స్‌‌‌‌ కేటగిరీలో న్యూజిలాండ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ మిలీ కెర్‌‌‌‌కు విమెన్స్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్‌‌‌‌ అవార్డు దక్కింది.