ఉమెన్స్ డబుల్స్ నుంచి సానియా ఔట్

 ఉమెన్స్ డబుల్స్ నుంచి  సానియా ఔట్

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 నుంచి  సానియా మీర్జా అన్నా డానిలీనా జోడి నిష్క్రమించింది. మహిళల డబుల్స్లో  అలిసన్ వాన్ ఉత్వానాక్- అన్హెలినా కాలినానా జంట చేతిలో 4-6, 6-4, 2-6 తేడాతో సానియా  అన్నా   ద్వయం ఓటమిపాలైంది. 

 ఉమెన్స్ డబుల్స్లో ఓడిన సానియా మీర్జా.. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రోహన్ బోపన్నతో కలిసి  రెండో రౌండ్‌కు చేరుకుంది. సానియా, బోపన్న జోడి 6-3 , 7-5 స్కోరు తేడాతో ఆస్ట్రేలియన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జామీ ఫోర్లిస్, ల్యూక్ సవిల్లేను ఓడించింది. 

ఉమెన్స్ డబుల్స్ ఓడిన సానియాకు ఇదే చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ. రీసెంట్గా టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన సానియా..ఆస్ట్రేలియా ఓపెన్, దుబాయ్ ఓపెన్ తర్వాత టెన్నిస్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించింది.  తన టెన్నిస్ కెరీర్లో సానియా ఎన్నో విజయాలు సాధించింది. 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్  డబుల్స్ టైటిల్ను దక్కించుకుంది. 2015లో యుఎస్ ఓపెన్,  వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచింది. 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ టైటిల్ను కైవసం చేసుకుంది.  మొత్తంగా 2003లో ఇంటర్నేషనల్ టెన్నిస్లోకి అడుగుపెట్టిన సానియా మీర్జా 2005లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో తన ప్రొఫెషనల్‌ కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు 6 సార్లు డబుల్స్  టైటిల్స్ సాధించింది.  2010 కామన్వెల్త్ గేమ్స్‌లో ఉమెన్స్ సింగిల్స్‌లో  సిల్వర్ మెడల్ గెలిచింది.