స్మార్ట్ టీవీలో పిక్చర్ క్వాలిటీయే ఫస్ట్.. బయర్ల మొదటి ప్రాధాన్యత ఇదే

స్మార్ట్ టీవీలో పిక్చర్ క్వాలిటీయే ఫస్ట్.. బయర్ల మొదటి ప్రాధాన్యత ఇదే
  • టీవీ, ఫ్రిజ్​ల విషయంలో ఎనర్జీ రేటింగ్​
  • ఏఐ టెక్నాలజీలకు పెద్దపీట
  • అమెజాన్​ టెక్​ సర్వే వెల్లడి

హైదరాబాద్​, వెలుగు:స్మార్ట్ టీవీలు, గృహోపకరణాల కొనుగోలు విషయంలో వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారని అమెజాన్ ఇండియా తన బెస్ట్ ఇన్ టెక్ సర్వేలో వెల్లడించింది.   

దీని ప్రకారం.. స్మార్ట్ టీవీ కొనుగోలుదారులలో 66 శాతం మంది పిక్చర్ క్వాలిటీ తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. ఏఐ ఆధారిత పిక్చర్ ఇంప్రూవ్‌‌‌‌మెంట్ టెక్నాలజీని 51 శాతం మంది కోరుకుంటున్నారు. ఏసీలు, ఫ్రిజ్‌‌‌‌లు కొనేవాళ్లు ఎనర్జీ స్టార్  రేటింగ్‌‌‌‌కు పెద్దపీట వేస్తున్నారు. ఏసీ కొనుగోలుదారుల్లో 35 శాతం మంది హై ఎనర్జీ రేటింగ్‌‌‌‌కు ప్రాధాన్యం ఇవ్వగా, 49 శాతం మంది ఉచిత ఇన్‌‌‌‌స్టాలేషన్‌‌‌‌ను కోరుకుంటున్నారు. రిఫ్రిజిరేటర్ల విషయంలో 70 శాతం మంది డ్యామేజ్ లేని డెలివరీ తమకు ముఖ్యమని తెలిపారు. 

వాషింగ్ మెషీన్ల విషయానికి వస్తే 40 శాతం మంది ఇన్వర్టర్ మోటార్‌‌‌‌ను ఇష్టపడుతుండగా, 18 శాతం మంది ఏఐ ఆధారిత వాష్ ప్రోగ్రామ్‌‌‌‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. దాదాపు 51 శాతం మంది బయర్లు తమకు నో కాస్ట్ ఈఎంఐ చాలా ముఖ్యమని చెప్పారు. ఈనెల18న బెస్ట్ ఇన్ టెక్ అవార్డులు ఇస్తామని అమెజాన్​ ప్రకటించింది.