Sanjay Dutt : షూటింగ్ లో గాయాలు.. సంజయ్ దత్ క్లారిటీ

Sanjay Dutt : షూటింగ్ లో గాయాలు.. సంజయ్ దత్  క్లారిటీ

తాను సినిమా సెట్టింగ్ లో గాయపడినట్లు వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ స్పందించారు.  అలాంటి వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. దేవుడి దయవల్ల  తాను ఆరోగ్యంగా ఉన్నానని ట్విట్టర్లో వెల్లడించారు. తాను కేడీ సినిమా షూటింగ్ చేస్తున్నానని చెప్పారు. తన సన్నివేశాలు తీసేటప్పుడు  టీమ్ చాలా జాగ్రత్తగా ఉందని తెలిపారు.ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.

సీనియర్ హీరో  యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా నటిస్తున్న కేడీ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా  బెంగళూరులోని మగాది రోడ్డులో ఈ సినిమా షూట్ జరుగుతోంది. ఏప్రిల్ 12న యాక్షన్ సీన్స్ తీశారు.  ఈ క్రమంలోనే సంజయ్ దత్ గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఆయన చేతుల, మోచేతులకు గాయలయ్యాయని..షూటింగ్ ను ఆపేసినట్లు తెలిసింది.  సోషల్ మీడియాలో సంజయ్ దత్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. గెట్ వెల్ సూన్ అంటూ పోస్టులు పెట్టారు. దీంతో సంజయ్ దత్ కాసేపటి క్రితం క్లారిటీ ఇచ్చారు తాను క్షేమంగా ఉన్నానని చెప్పారు. 

https://twitter.com/duttsanjay/status/1646159738575486976