రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు

రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు

భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)  కొత్త చీఫ్ గా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. జూనియర్ రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజీనామా తర్వాత జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తన ప్యానెల్ ఈజీగా గెలుచుకోవడంతో గురువారం (డిసెంబర్ 21) సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడయ్యారు.

యూపీ రెజ్లింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన సంజయ్ .. తన ప్రత్యర్థి అనితా షెరాన్ పై 40 ఓట్లతో గెలిచారు. CWGగోల్డ్ మెడలిస్ట్ ప్యానెల్ WFI సెక్రటరీ జనరల్ పదవిని గెలుచుకుంది.  WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సంజయ్ సింగ్ అత్యంత సన్నిహితుడు కావడంతో ఢిల్లీలోని బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ఇంటి ముందు పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు ఫ్యాన్స్. 

భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) .. 2023లో ఎన్నో వివాదాలు..రెజ్లర్ల ధర్నాలు..నెలల తరబడి ఢిల్లీ వీధుల్లో రెజర్ల ఆందోళనలు.దీంతో కొంత కాలం పాటు భారత రెజ్లింగ్  సమాఖ్య అధ్యక్ష ఎన్నికలు ఆగిపోయాయి. బ్రిజ్ భూషణ్ రెజ్లింగ్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన చాలా రోజుల తర్వాత జరిగిన ఎన్నికల్లో  బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ కొత్త చీఫ్ గా ఎన్నికయ్యారు.