IPL 2023 : SRH పై సంజూ శాంసన్ రికార్డ్.. తొలి బ్యాట్స్మెన్ అతనే

IPL 2023 : SRH పై సంజూ శాంసన్ రికార్డ్.. తొలి బ్యాట్స్మెన్ అతనే

సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 72 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. దీంతో ఆర్ఆర్ 204 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో ఒక జట్టుపై ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా సంజూ రికార్డ్ సృష్టించాడు.
 
ఈ మ్యాచులో 55 పరుగుల చేసిన సంజూ.. సన్ రైజర్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్ గా సన్ రౌజర్స్ పై 725 పరుగులు చేశారు. సంజూ తర్వాత ఎస్ఆర్ హెచ్ పై.. అత్యధిక పరుగులు చేసింది విరాట్ కోహ్లి 569, షేన్ వాట్సన్ 566, డివిలియర్స్ 540, అంబటి రాయుడు 540  తర్వాతి స్థానాల్లో ఉన్నారు.