రాహుల్‌‌‌‌‌‌‌‌ ఆగయా! ..తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ ఔట్‌‌‌‌‌‌‌‌

రాహుల్‌‌‌‌‌‌‌‌ ఆగయా! ..తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ ఔట్‌‌‌‌‌‌‌‌

పల్లెకెలె: వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ దాదాపుగా ఖరారైంది. మొత్తం 15 మందితో కూడిన ప్రొవిజినల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌లో నుంచి తెలుగు బ్యాటర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణతో పాటు స్టాండ్‌‌‌‌‌‌‌‌ బైగా ఉన్న సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌ను తప్పించినట్లుగా తెలుస్తోంది. తొడ సర్జరీ తర్వాత ఎన్‌‌‌‌‌‌‌‌సీఏలో రిహాబిలిటేషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ను కూడా టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నారు. అయితే అతను ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌ సమర్పించిన తర్వాత అధికారికంగా దీనిపై ప్రకటన చేయనున్నారు. 

ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు దూరమైన రాహుల్‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాడు. మంగళవారం లోగా టీమ్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో చీఫ్‌‌‌‌‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌‌‌‌‌ అజిత్‌‌‌‌‌‌‌‌ అగార్కర్‌‌‌‌‌‌‌‌.. కోచ్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌తో శనివారం అర్ధరాత్రి సంప్రదింపులు చేసి జట్టును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. పాక్‌‌‌‌‌‌‌‌పై 81 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌కు సెకండ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌గా చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. వన్డేల్లో పెద్దగా రాణించలేకపోతున్న సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌పై సెలెక్టర్లు నమ్మకం పెట్టారు. వెటరన్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌, చహల్‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకోలేదు.   

ఇండియా ప్రొవిజినల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌: రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా (వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌), శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌, జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా, మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌ షమీ, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌.