ఆర్టీసీకి సంక్రాంతి బూస్ట్

ఆర్టీసీకి సంక్రాంతి బూస్ట్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీకి సంక్రాంతి బస్సుల ద్వారా రికార్డు స్థాయి ఇన్​కం వచ్చింది. 11 రోజుల్లో రూ. 165.46 కోట్ల ఆదాయం వచ్చిందని, 2 కోట్ల 82 లక్షల మంది ప్యాసింజర్స్ ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేశారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రూ.62.29 కోట్ల ఆదాయం ఎక్కువ వచ్చిందని, 12 లక్షల మంది అదనంగా జర్నీ చేశారని పేర్కొన్నారు.

గత ఏడాది సంక్రాంతికి ఆక్యుపెన్సీ రేషియో 59.17 శాతం ఉండగా, ఈ ఏడాది 71.19 శాతానికి  పెరిగిందని చెప్పారు. సాధారణ చార్జీలతోనే 3,923 స్పెషల్ బస్సులు నడిపామన్నారు. ఇంత ఆదాయం రావడం వెనుక ఉద్యోగుల కృషి ఉందన్నారు.