పెళ్లి కొడుకు గెటప్ లో నామినేషన్

పెళ్లి కొడుకు గెటప్ లో నామినేషన్

ఉత్తర్ ప్రదేశ్ లోని షాహజాన్ పూర్ లో ఓ అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ వేశారు. సంయుక్త్ వికాస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వైద్ రాజ్ కిషన్ పెళ్లి కొడుకు వేషాధారణలో గుర్రంపై వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. పెళ్లి మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత ఉంటుందని చెప్పారు.  కిషన్ ర్యాలీని స్థానికులు ఆసక్తిగా చూశారు.