బీజేపీ గ్రేట్​ పార్టీ.. అందుకే చేరా: సప్నా చౌదరి

బీజేపీ గ్రేట్​ పార్టీ.. అందుకే చేరా: సప్నా చౌదరి

‘బీజేపీ గ్రేట్​పార్టీ.. పార్టీ పనితీరు నచ్చి సభ్యత్వం తీసుకున్నా. దీనిపై రెండో ఆలోచనకు తావులేదు’ అని హర్యానా  సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి చెప్పారు. బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా ఆదివారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పార్టీ ఢిల్లీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారీ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా మాస్​ మెంబర్​షిప్​ పోగ్రాంలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. జవహర్​లాల్​నెహ్రూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్​ మాజీ సీఎం శివరాజ్​సింగ్​చౌహాన్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో సప్నా చౌదరి మనోజ్ ​తివారీ తరఫున ప్రచారం చేశారు. దీంతో ఆమె బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అప్పట్లో ఈ ప్రచారాన్ని కొట్టిపారేసిన సప్నా చౌదరి.. మనోజ్​తనకు మంచి మిత్రుడని, అందుకే ప్రచారంలో పాల్గొన్నానని వివరణ ఇచ్చారు.