
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ కు ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో చోటు దక్కలేదు. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ క్రికెటర్లు టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా.. కనీసం టీమిండియా స్క్వాడ్ లో కూడ సర్ఫరాజ్ స్థానం లేకపోవడం విచారకరం. సర్ఫరాజ్ ఈ సిరీస్ లో చోటు దక్కించుకోకపోయినా తన ఫిట్ నెస్ పై ఫోకస్ చేశాడు. కఠిన డైట్ చేస్తూ కేవలం రెండు నెలల్లోనే 17 కిలోల శరీర బరువు తగ్గి స్లిమ్ అండ్ ట్రిమ్ లుక్ తో కనిపించి ఆశ్చర్యానికి గురి చేశాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్రంలో సన్నగా కనిపిస్తూ వైరల్ గా మారుతున్నాడు.
రంజీ ట్రోఫీకి నెలకు ముందు సర్ఫరాజ్ ఈ లుక్ లో కనిపించి హాట్ టాపిక్ గా మారాడు. రెండు నెలల క్రితం ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు 10 ఈ ముంబై బ్యాటర్ కఠినమైన డైట్ ప్లాన్ చేసి 10 కిలోల బరువు తగ్గాడు. తర్వాత రెండు నెలలో మరో 17 కేజీలు తగ్గడం విశేషం. అతను ఫిట్ గా ఉండటానికి ఉడికించిన కూరగాయలు తినడంతో పాటు చికెన్ పూర్తిగా మానేసి ఫిట్ నెస్ పై ఫోకస్ చేశాడు. ఫిట్ నెస్ తో పాటు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రోజుకు రెండు పూటలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సర్ఫరాజ్ డెడికేషన్ పట్ల ప్రశంసల వర్షం కురుస్తుంది. సోషల్ మీడియాలో నెటిజన్స్ తో పాటు మాజీలు ఈ ముంబై క్రికెటర్ ను తెగ పొగిడేస్తున్నారు.
సర్ఫరాజ్ తన చివరి టెస్టును గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XIతో ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సర్ఫరాజ్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. దీనికి తోడు గాయం కారణంగా 2024-25 రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. 2024 ఫిబ్రవరి 15 రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలు చేసి సత్తా చాటాడు. ఓవరాల్ గా ఆరు టెస్టుల్లో ఇండియా తరపున 371 పరుగులు చేశాడు.
Sweat. Sacrifice. Strength. Sarfaraz Khan's transformation is pure dedication! 😳🔥 pic.twitter.com/BgzuAjAGh8
— CricketGully (@thecricketgully) July 21, 2025