అంబేద్కర్ కాలేజీలో ‘నిర్మాణ్’ ప్లేస్‌‌మెంట్ సెల్ ప్రారంభించిన సరోజా వివేక్ 

అంబేద్కర్ కాలేజీలో ‘నిర్మాణ్’ ప్లేస్‌‌మెంట్ సెల్ ప్రారంభించిన సరోజా వివేక్ 

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్మాణ్ సంస్థ, డాక్టర్​బీఆర్.అంబేద్కర్ డిగ్రీ, పీజీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో కాలేజీలో సోమవారం ఏర్పాటు చేసిన నిర్మాణ్ కేరీర్​అండ్​ప్లేస్‌‌మెంట్ సెల్ ను కరస్పాండెంట్ సరోజా వివేక్ ప్రారంభించారు. 

నిర్మాణ్ సంస్థ ప్లేస్‌‌మెంట్ సెల్‌‌ను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ, ప్లేస్‌‌మెంట్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. 

డాక్టర్​లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ సెల్ ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. నిర్మాణ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సీఎక్స్ వో హరీశ్​మాట్లాడుతూ.. ప్లేస్‌‌మెంట్ సెల్ ప్రారంభానికి సహకరించిన కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, కెరీర్ గైడెన్స్, ఉపాధి అవకాశాల కల్పనకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.