- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి/గంగాధర, వెలుగు: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్న నమ్మకంతోనే ఇతర పార్టీల లీడర్లు పార్టీలో చేరుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం చొప్పదండి, గంగాధర మండలాలకు చెందిన పలు గ్రామాల సర్పంచులు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ బలపరిచిన చొప్పదండి మండలం గుమ్లాపూర్ సర్పంచ్ లింగాల ఆనంద్, ఉపసర్పంచ్ ఇనుకొండ రమణారెడ్డి, గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ బాసవేణి శ్రీనివాస్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యరద్శి పెరుమాండ్ల గంగయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మునిగాల రాజేందర్, లీడర్లు సాయగౌడ్, పవుల్, చందు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన సర్పంచులు
బోయినిపల్లి వెలుగు: బోయినిపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు మంగళవారం గంగాధర క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేను మేడిపల్లి సత్యంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచిచంఆరు. గ్రామాల అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సర్పంచులు జంగం అంజయ్య, ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, నల్లమోహన్ తదితరులు ఉన్నారు. దుండ్రపల్లి ఉపసర్పంచ్ కందుల గంగారెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
