ఖమ్మం టౌన్, వెలుగు: ఇంటర్ ఫస్ట్,సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఖమ్మం సిటీలోని సర్వజ్ఞ కాలేజ్ స్టూడెంట్స్ రాష్ట్ర స్థాయిలో విజయకేతనం ఎరుగువేశారని కాలేజ్ చైర్మన్ ఆర్.వి.నాగేంద్ర కుమార్, డైరెక్టర్ నీలిమలు ఆదివారం తెలిపారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో వై.వెన్నెల 468 మార్కులు సాధించగా, ఎస్.సాయి మణికంఠ 467, బి.తరుణ్ 467, వై.అనితర 467, జి.అనన్య వెంకట్ 466, జి.జ్ఞాన దీప్తి 466, వై.గీత మాధురి 466, పి.ఆదిత్య 464, బి.హస్వంత్ 463, ఎ.భవ్య 463, ఆర్.సాయి తేజ 463, పలువురు 460కి పైగా మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు.
బీపీసీలో సాయి విశ్వనాథ్437, జ్ఞాన ప్రసూనాంబ 435, ఎన్.అభినందిత 434, బి.అశ్విత 433 మార్కులు సాధించినట్లు తెలిపారు. నాగేంద్ర కుమార్, నీలిమ మాట్లాడుతూ ఐఐటీ, జేఈఈ, నీట్ లలో సీట్ల సాధనే లక్ష్యంగా సర్వజ్ఞ కాలేజ్ ముందుకు సాగుతుందన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన స్టూడెంట్స్ ను చైర్మన్, డైరెక్టర్, అకాడమిక్ డీన్, ఫిజిక్స్ లెక్చరర్ జనార్దన్ కాలేజ్ ప్రాంగణంలో అభినందించారు.

