హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎలక్షన్ ఎఫైర్స్కమిటీని నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్‌ను నియమించారు.
సభ్యులుగా కేతినేని సరళ (కార్పొరేటర్), డాక్టర్ ప్రేమ్‌రాజ్, ఆంటోని రెడ్డి (అడ్వొకేట్), డాక్టర్ఎం. లక్ష్మణ్, ఈడెల్లి అజయ్‌కుమార్, పొన్న వెంకటరమణ, పవన్, భరద్వాజ్‌ను ఎంపిక చేశారు.
ఈ కమిటీ ఎన్నికల సమయంలో ఎదురయ్యే సమస్యలు, ఇతర అంశాలను సీఈవో దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పనిచేయాల్సి ఉంటుంది.
