సాధారణంగా ఫ్రిడ్జ్‌ని వేసవిలోనే ఎక్కువగా వాడతారు. అప్పుడు టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫ్రిడ్జ్‌ను తెరుస్తుంటారు. అయితే వర్షాకాలం, శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్‌తో పెద్దగా పని ఉండదు. అలాంటప్పుడు ఫ్రిడ్జ్ టెంపరేచర్ తగ్గించుకోవచ్చు. దాని వల్ల కరెంట్ వాడకం కూడా తగ్గుతుంది.
కానీ, చాలామంది ఈ సెట్టింగ్స్ గురించి పట్టించుకోకుండా సంవత్సరమంతా ఒకే టెంపరేచర్లో ఉంచుతారు. దానివల్ల ఉపయోగం లేదు.. కరెంట్ బిల్ కూడా ఎక్కువే. కాబట్టి ఈ వింటర్ సీజన్లో రిఫ్రిజరేటర్ టెంపరేచర్ను ఇలా సెట్ చేసుకోండి.
ఫ్రిడ్జ్‌లో టెంపరేచర్ను కంట్రోల్ చేయడానికి డయల్ లేదా డిజిటల్ ప్యానెల్ ఉంటుంది. దీన్ని సాధారణంగా 0 నుంచి 5 లేదా 1 నుంచి 7 వరకు సెట్ చేసుకోవచ్చు. వేసవిలో ఎలాగూ చల్లదనం ఎక్కువగా కావాలి కాబట్టి 4 లేదా 5కి సెట్ చేసుకుంటారు. కానీ.. ఇప్పుడు శీతాకాలంలో ఫ్రిడ్జ్‌ను 2 లేదా 3కి సెట్ చేసుకుంటే చాలు. ఫ్రీజర్ వింటర్, సమ్మర్ సీజన్లలో 18 లేదా 20 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉండాలి.
అయితే ఫ్రిడ్జ్‌లో అన్ని విభాగాల్లో టెంపరేచర్స్ ఒకేలా ఉండవు. కూరగాయల కోసం క్రిస్పర్ డ్రాయర్ వాడాలి. అది తేమను కంట్రోల్ చేస్తుంది. పై అల్మారాలు, డోర్ రాక్లు చల్లగా ఉంటాయి. పాలు, రసం లేదా సాస్‌లు వంటి వాటిని అక్కడ స్టోర్ చేయాలి. కింది అల్మారాల్లో కూలింగ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మాంసం లేదా మిగిలిపోయిన వాటిని నిల్వ చేయొచ్చు.
