తెలుగు ఓటీటీ ప్రపంచంలో క్లాసిక్ కామెడీ సిరీస్‌గా నిలిచిన 'సేవ్ ది టైగర్స్' గుర్తుందిగా? పెళ్ళాం బాధితుల సంఘం లీడర్లు ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్యలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మొదటి రెండు సీజన్లు సృష్టించిన వ్యూవర్‌షిప్ రికార్డులు, నవ్వుల సునామీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అంతకుమించిన డోస్‌తో, మరింత క్రేజీగా సీజన్ 3 వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన సరికొత్త ట్రైలర్‌ను లేటెస్ట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ రిలీజ్ చేసింది.
ఈసారి కాన్సెప్ట్ మామూలుగా లేదుగా..
ట్రైలర్ చూస్తుంటే ఈసారి డైరెక్టర్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు. భూలోకంలో భార్యల టార్చర్‌ను తట్టుకోలేక అల్లాడిపోతున్న మన ముగ్గురు 'టైగర్స్' ని కాపాడటానికి సాక్షాత్తూ ఆ స్వర్గలోక అధిపతి లార్డ్ ఇంద్రుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ఇంద్రుడి పాత్రలో టాలీవుడ్ కింగ్ ఆఫ్ కామెడీ వెన్నెల కిశోర్ నటిస్తున్నారు. ఇంద్రలోకం బ్యాక్‌డ్రాప్, వెన్నెల కిశోర్ మార్క్ టైమింగ్ తోడవ్వడంతో ఈసారి గందరగోళం, వినోదం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని ఫిక్స్ అయిపోవచ్చు. భార్యల నుంచి భర్తలను ఇంద్రుడు ఎలా సేవ్ చేశాడనేదే ఈ సీజన్ మెయిన్ హైలైట్ గా నిలవనుంది.
'క్రేజీ' మైండ్స్ ఇవే..
మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్‌ను శ్రీరామ్ ఇగారమ్ అద్భుతంగా తెరకెక్కించారు. శివ మేక, సాహితి చితలపూడి సంయుక్తంగా దీనిని నిర్మించారు. ఈ సిరీస్‌లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మలు భార్యలుగా తమ నటనతో మెప్పించగా.. రోహిణి, గంగవ్వ లాంటి పక్కా లోకల్ ఎంటర్‌టైనర్స్ కూడా కీలక పాత్రల్లో నవ్వించబోతున్నారు.
►ALSO READ | Janhvi Kapoor: బాబోయ్ మళయాళంలో నటించడం నావల్ల కాదు.. 'పెద్ది' ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్ క్రేజీ కామెంట్స్!
స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఈ క్రేజీ ఫన్ రైడ్ జూన్ 19 నుంచి తెలుగుతో పాటు మరెన్నో భాషల్లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మొదటి రెండు సీజన్లు కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ఈ సీజన్ 3 లోనే ఉంది. మరి ఈ టైగర్స్ ఈసారైనా భార్యల చేతిలో 'పిల్లులు' కాకుండా గెలిచారా లేదా అనేది తెలియాలంటే జూన్ 19 వరకు వెయిట్ చేయాల్సిందే..
