లావాదేవీలపై SBI కీలక నిర్ణయం

లావాదేవీలపై SBI కీలక నిర్ణయం

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) లావాదేవీలపై కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. రోజూవారీ ఆన్‌లైన్ లావాదేవీలు, ATM కార్డు ద్వారా డబ్బులు తీసుకునే వినియోగదారులపై పరిమితి విధించింది. SBI ATM కస్టమర్లు ఒక రోజుకు రూ. 40,000 మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లావాదేవీలు ఒక రోజుకు రూ. 75,000 మాత్రమే చేయాలని బ్యాంకు స్పష్టం చేసింది. బ్యాంకు పెట్టిన పరిమితి ఉచిత క్యాష్ విత్ డ్రా కన్నా ఎక్కువసార్లు డబ్బు తీసుకుంటే అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఏటీఎం కార్డు నిర్వహణకు ఏడాదికి GSTతో కలిపి రూ.125, కార్డు మార్చుకోవడానికి GSTతో కలిపి రూ. 300 వసూలు చేయనున్నారు.

ATMలో మరికొన్ని కొత్త సర్వీసులను ప్రవేశపెట్టినట్లు SBI తెలిపింది. పిన్ నెంబర్ మార్పు, చెక్ బుక్ కోసం దరఖాస్తు, బిల్లుల చెల్లింపు,IMPS రిజిస్ట్రేషన్, మొబైల్ ఫోన్ల రీచార్జ్‌తోయ పాటు మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.