యూసుఫ్‌‌‌‌‌‌‌‌ గూడలోని ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లో నగదు మాయంపై ఎస్‌‌‌‌‌‌‌‌ బీఐ అధికారుల ఫిర్యాదు

యూసుఫ్‌‌‌‌‌‌‌‌ గూడలోని ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లో నగదు మాయంపై ఎస్‌‌‌‌‌‌‌‌ బీఐ అధికారుల ఫిర్యాదు

జూబ్లీహిల్స్, వెలుగు: యూసుఫ్‌‌‌‌‌‌‌‌గూడలోని ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లో ఏటీఎంలో ఉండే నగదును దుర్వినియోగం చేశాడు. ఏటీఎంలో నగదు జమ చేసే క్యాష్- ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి అబ్బిరెడ్డి యాదగిరి రెడ్డిపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2025 అక్టోబర్  7న ఏటీఎం రీప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్  చేసే సమయంలో ప్రత్యక్షంగా నగదు ధృవీకరించకుండా, ఏటీఎం క్యాసెట్ల నుంచి నగదును తొలగించకుండానే రూ.27.50 లక్షల నగదు ఎంట్రీలను సీబీఎస్  సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసినట్లు గుర్తించారు.

అనుమానాస్పద లావాదేవీలపై బ్యాంకు అధికారులు  తనిఖీలు నిర్వహించారు. బ్రాంచ్  రికార్డులు, సీసీ పుటేజీ ఆధారంగా రూ.23 లక్షల నగదు తక్కువగా ఉన్నట్లు తేల్చారు. నిందితుడిపై ఫిర్యాదు చేయగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.