రూ.25 వేల కోట్లు సేకరించనున్న ఎస్బీఐ

రూ.25 వేల కోట్లు సేకరించనున్న ఎస్బీఐ

న్యూఢిల్లీ: ఎస్​బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఆఫర్ లేదా ప్రైవేట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ద్వారా 3 బిలియన్ డాలర్ల (దాదాపు 25,077 కోట్లు)నిధుల సేకరణ ప్రణాళికను ఆమోదించింది.

ఈ నెల 20న జరిగిన సమావేశంలో సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, 2025-–26 ఆర్థిక సంవత్సరంలో యూఎస్​ డాలర్ లేదా ఏదైనా ఇతర ప్రధాన విదేశీ కరెన్సీలో పబ్లిక్ ఆఫర్ / ప్రైవేట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ద్వారా 3 బిలియన్ డాలర్ల వరకు సేకరించాలని నిర్ణయించిందని ఎస్​బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలిపింది.

ఎస్​బీఐ షేర్లు మంగళవారం 1.20 శాతం తగ్గి రూ.785.35 వద్ద ముగిశాయి.