ఫేక్ అరెస్ట్ వారెంట్ పంపి.. రూ.33 లక్షలు కొట్టేశారు

ఫేక్ అరెస్ట్ వారెంట్ పంపి.. రూ.33 లక్షలు కొట్టేశారు

బషీర్​బాగ్​, వెలుగు: ఫేక్​ అరెస్టు వారెంటుతో భయపెట్టి ఓ వృద్ధుడి వద్ద సైబర్​ నేరగాళ్లు రూ.33 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం... బోయిన్ పల్లికి చెందిన 73 ఏళ్ల వృద్ధుడికి జులై 25న స్కామర్స్ కర్నాటక క్రైమ్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్ గౌరవ్ సారథిగా పరిచయం చేసుకున్నారు. మానవ అక్రమ రవాణా, అశ్లీల కంటెంట్ కేసుల్లో వృద్ధుడి ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందని చెప్పారు. 

ఐపీఎస్ అధికారి దయానాయక్  అంటూ మరో కాల్ చేసి రూ.15 లక్షలు డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేశారు. వెరిఫై చేసుకున్నా మళ్లీ డబ్బులు ఇస్తామన్నారు. ఇలా పలు దఫలుగా రూ.33 లక్షల 40 వేలు బదిలీ చేయించుకున్నారు. ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు సంప్రదించాడు.