వర్షాలకు హైదరాబాద్ లో కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్

వర్షాలకు హైదరాబాద్ లో కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ప్రాజెక్టులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. పట్టణాలలోని రోడ్లైతే స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయి. వర్షాల వల్ల పాత ఇళ్లు, బిల్డింగులు కూలిపోతున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల గోడలు పూర్తిగా నాని మెత్తబడటంతో సుల్తాన్ బజార్ లోని ఓ స్కూల్ బిల్డింగ్ గురవారం కుప్పకూలిపోయింది. అయితే కరోనా కారణంగా పాఠశాల మూతపడటంతో విద్యార్థులెవరూ లేరు. దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వెంటనే స్పందించిన డిజాస్టర్ టీం, జీహెచ్ఎంసీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగిస్తున్నారు.

For More News..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ సీఈఓ

ట్రంప్ దెబ్బకు టిక్‌టాక్ సీఈవో రాజీనామా

నా కొడుకుకు రియా విషం పెట్టి చంపింది.. సుశాంత్ తండ్రి సెల్ఫీ వీడియో