దారుణం: విద్యార్థినిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారయత్నం

దారుణం: విద్యార్థినిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారయత్నం

నెల్లూరులో దారుణం జరిగింది. స్థానిక విద్యా విహార్ స్కూల్ లో ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అదే స్కూల్ లో పనిచేస్తున్న వ్యాన్ డ్రైవర్ శివ అత్యాచారం చేయబోయాడు. వ్యాన్ లో ఇంకేవరూ లేకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. గురువారం ఉదయం స్కూల్ కు వెళ్లే మార్గంలో దీన్ దయాల్ నగర్ సమీపంలో ఉన్న సమాధుల వద్ద వ్యాన్ ఆపి.. ఆ విద్యార్ధినిపై లైంగిక దాడికి యత్నించాడు. విషయాన్ని గమనించిన స్థానికులు శివకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆగ్రహంతో ఆ స్కూల్‌ వ్యాన్‌ను తగలబెట్టారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.