వీసీలపై గవర్నర్‌‌‌‌ అధికారాలకు కత్తెర

వీసీలపై గవర్నర్‌‌‌‌ అధికారాలకు కత్తెర

వీసీలపై గవర్నర్‌‌‌‌ అధికారాలకు కత్తెర
బిల్లు తెచ్చిన తమిళనాడు సర్కార్​

చైన్నె: యూనివర్సిటీలకు వీసీలను నియమించే విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌‌‌‌కు వర్సిటీల వీసీలను నియమించే అధికారాన్ని తొలగిస్తూ తెచ్చిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును అన్నాడీఎంకే, బీజేపీ వ్యతిరేకించాయి. ‘‘సంప్రదాయం ప్రకారం రాష్ట్ర సర్కార్‌‌‌‌తో సంప్రదించి గవర్నర్‌‌‌‌ వర్సిటీల వీసీలను నియమిస్తారు. గత కొన్నేండ్లుగా గవర్నర్లు దాన్ని తమ ప్రత్యేక హక్కుగా భావిస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని అగౌరవపర్చడమే కాకుండా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. ఈ ప్రస్తుత వ్యవస్థ వల్ల వర్సిటీల పాలన గందరగోళానికి దారితీస్తోంది”అని స్టాలిన్ అన్నారు. యూనివర్సిటీల చాన్స్‌‌లర్‌‌‌‌ పదవి నుంచి గవర్నర్‌‌‌‌ను తొలగించాలని పూంచీ కమిషన్‌‌ సిఫార్సు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. 

మరిన్ని వార్తల కోసం..

భూ సంస్కరణల అవసరం మళ్లీ ఉందా?

టీఆర్ఎస్ ప్లీనరీకి పకడ్బందీ ఏర్పాట్లు