రేణిగుంట, అగర్తలా మధ్య కార్గో ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌

రేణిగుంట, అగర్తలా మధ్య కార్గో ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్ డివిజన్​లో సరుకు రవాణా లాజిస్టిక్స్‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేసే దిశగా రేణిగుంట–నిశ్చింతపూర్(అగర్తలా) మధ్య పార్సెల్ కార్గో ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. వ్యాపారులు, వ్యవసాయ ఉత్పత్తిదారులకు తోడ్పడేందుకు ఆరేండ్ల పాటు సేవలను అందించనున్నట్టు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు.

తొలి సర్వీసులో పోకచెక్కలు, ఆల్ అవుట్ లిక్విడ్ రీఫిల్స్, అగరుబత్తీలు, చాక్లెట్లు, ఇతర గృహ  వినియోగ వస్తువులను రవాణా చేస్తున్నారు. ఈ రైలు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులను సుదూర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో మిరపకాయలు, ఎమ్​ఆర్​ఎఫ్​ టైర్లు, ఐటీసీ, క్యాడ్బరీ, కిమ్బెర్లీ  క్లార్క్ ఉత్పత్తులు వంటివి రవాణా చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఆరేండ్ల కాలంలో సుమారు రూ. 54 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అధికారులు అంచనా వేస్తున్నారు.