సెకండ్ ఫేజ్ పంచాయతీ ..జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు

సెకండ్ ఫేజ్ పంచాయతీ ..జిల్లాల వారీగా  పోలింగ్ శాతం వివరాలు

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు  కౌంటింగ్  ప్రారంభమైంది. . డిసెంబర్ 14 మధ్యాహ్యం 1 గంటలతో పోలింగ్ ముగిసింది.  రెండో దశలో రాష్ట్రంలో 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్, 29,917 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిగింది .

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒంటిగంట వరకు పోలింగ్ శాతం వివరాలు చూస్తే..  మహబూబాబాద్ జిల్లా 82.24శాతం. ములుగు జిల్లాలో  81.53 శాతం జనగామ.. 81.20, భూపాల పల్లి 84 .14, హనుమకొండ  76.50, వరంగల్.77.66 శాతం, కరీంనగర్ జిల్లాలో 84.63 శాతం పోలింగ్  నమోదయ్యంది. 

ALSO READ : తెలంగాణలో ముగిసిన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

కుమ్రంబీమ్  జిల్లాలో 84.56%పోలింగ్  శాతం నమోదయ్యింది. ఆదిలాబాద్ జిల్లాలో  రికార్డుస్థాయిలో  పోలింగ్ శాతం 83.80శాతం నమోదయ్యింది.  ఉమ్మడి మెదక్ జిల్లా ఒంటి గంట వరకు  సంగారెడ్డి జిల్లాలో  82.75 శాతం , సిద్దిపేట 84.37 ,మెదక్  84.67 పోలింగ్ నమోదయ్యింది. మహబూబ్‌నగర్ 79.20 శాతం, 

జగిత్యాల జిల్లా   వ్యాప్తంగా మధ్యాహం ఒంటి  గంట వరకు 74.7 శాతం పోలింగ్ నమోదయ్యింది. మంచిర్యాల జిల్లాలో 79.02 శాతం ,రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో 83 శాతం . పెద్దపల్లి జిల్లాలో   80.84 శాతం నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లా పోలింగ్ శాతం 82.08 శాతం నమోదయ్యింది