- ఉప్పల్ మెట్రో డిపోలో రెండో సోలార్ ప్లాంట్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో ఉప్పల్ డిపోలో కొత్తగా నిర్మించిన 1.2 మెగావాట్ల రెండో సోలార్ ప్లాంట్‌ను శనివారం చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ డీవీఎస్ రాజు ప్రారంభించారు. దీంతో మెట్రో మొత్తం సోలార్ కెపాసిటీ 12.41 మెగావాట్లకు చేరుకుంది. ఇకపై మెట్రో వినియోగిస్తున్న విద్యుత్‌లో 16 శాతం సోలార్ నుంచే సరఫరా అవుతుంది.
ఈ కార్యక్రమంలో ఎల్అండ్టీ, కియోలిస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అదే సందర్భంగా మెట్రో రైళ్లలో వచ్చే రిపేర్లను సులభంగా గుర్తించేందుకు తయారు చేసిన టెస్ట్ బెంచ్‌లను డీవీఎస్ రాజు పరిశీలించారు. రైళ్ల నిర్వహణలో లోపాలు రాకుండా చూసుకోవాలని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సర్వీసులు నడపాలని అధికారులకు సూచించారు.
