సింగ్‌‌‌‌‌‌‌‌ గీతం నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

 సింగ్‌‌‌‌‌‌‌‌ గీతం నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో దర్శకుడిగా రూపొందిస్తున్న  చిత్రం ‘సింగ్‌‌‌‌‌‌‌‌ గీతం’.  వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా సెకండ్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘ఏమైంది’ అంటూ సాగే ఈ పాటను హీరోయిన్  శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పింది.  

ఈ  పాట ఓ మ్యూజికల్ పజిల్‌‌‌‌‌‌‌‌లా సాగుతుంది.  ఒక వింత పరిస్థితిలో చిక్కుకున్న గ్రామాన్ని ఈ పాట పరిచయం చేస్తుంది. ఆ గ్రామంలో సాధారణ సంభాషణలన్నీ పాటలుగా మారిపోతాయి. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ అర్థం కాకపోయినా, గ్రామస్తులంతా ఆ పరిస్థితికి అలవాటు పడాల్సి వస్తుంది. ప్రశ్నలు, సందేహాలు, ఆశ్చర్యాలన్నీ ట్యూన్స్‌‌‌‌‌‌‌‌గా మారిపోతూ వినోదాన్ని పంచుతాయి.  ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే, కథను ముందుకు నడిపిస్తూనే వినోదాన్ని అందించడం. గ్రామస్తుల గందరగోళం, ఆసక్తి, ఆ వింత పరిస్థితికి సమాధానం వెతికే ప్రయత్నం ప్రతి లిరిక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తుంది.   దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయడంతోపాటు  శ్రీమణి,  గౌతమ్ చల్లగుల్ల, రత్న శ్రీకర్, శశాంక్ చింతలపూడితో  కలిసి ‘ఏమైంది ఏమైంది..  బాబోయ్... ఏదో అయిపోయింది..’ అంటూ  క్యాచీ లిరిక్స్ అందించారు. నూతన నటులు అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 11న విడుదల కానుంది.