సికింద్రాబాద్ ఆల్ఫాహోటల్ క్లోజ్..

సికింద్రాబాద్ ఆల్ఫాహోటల్ క్లోజ్..

ఆహార నాణ్యత, కిచెన్ పరిశుభ్రత లోపం కారణంగా  సికింద్రాబాద్ ఆల్ఫాహోటల్ ను మూసి వేశారు  GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు. హోటల్ లో శుభ్రంగా లేని కిచెన్.. ఆహారంలో నాణ్యత లోపం ఉన్నాయన్న ఫిర్యాదులతో ఆదివారం హోటల్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ సోదాలు నిర్వహించారు. కొన్ని ఆహార పదార్థాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు. తక్షణమే హోటల్ ను మూసివేయాలని  అధికారులు ఆదేశించడంతో యాజమాన్యం హోటల్ ను మూసివేశారు.

ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నడుపుతున్నారని..ఆహార నాణ్యత, శుభ్రపరంగా ఎలాంటి జాగ్రత్తలు హోటల్ యాజమాన్యం చేపట్టడం లేదని ఫుడ్ సేప్టీ అధికారులు తెలిపారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై తగు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని అధికారులు తెలిపారు.