హైదరాబాద్ సిటీలో కలకలం. సికింద్రాబాద్ ఏరియాలోని చిలకలగూడ సీతాఫల్ మండిలో 23 ఏళ్ల యావన్. బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. మే 7వ తేదీ రాత్రి.. ఇందిరానగర్ లో స్నేహితులతో కలిసి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. రాత్రి 10 గంటల సమయం.. ఆ టైంలో.. మోటార్ సైకిళ్లపై ఆరుగురు కుర్రోళ్లు వచ్చారు. వచ్చీరాగానే.. ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న యావన్ ను.. మాట్లాడాలని బయటకు పిలిచారు. వాళ్ల మాటలు నమ్మి.. బయటకు వచ్చిన యావన్ ను.. నడి రోడ్డుపై.. ఇళ్ల మధ్యనే కత్తులతో దాడి చేశారు. యావన్ శరీరంపై ఆరు కత్తిపోట్లు పొడిచారు. తీవ్రగాయాలతో రోడ్డుపైనే పడిపోయిన యావన్.. స్నేహితులు సమీపంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు.
బీటెక్ స్టూడెంట్.. 23 ఏళ్ల యావన్ ను ఎందుకు చంపారు :
బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న యావన్.. ఓ యువతి ప్రేమలో పడ్డాడు. వీళ్లిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ అమ్మాయికి కూడా యవన్ అంటే ఇష్టమే. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. వాళ్ల ప్రేమను వ్యతిరేకించారు యువతి కుటుంబ సభ్యులు. కొన్నేళ్లుగా యావన్ కు బెదిరింపులు వచ్చాయి. మా అమ్మాయిని వదిలేయ్.. నీతో పెళ్లి చేయటం ఇష్టం లేదు అని పదే పదే హెచ్చరించారు. ఈ వివాదం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే యువతి కుటుంబ సభ్యులు యావన్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. పగ పెంచుకున్నారు. ప్రేమ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోయారు.
యావన్ హత్యలో యువతి సోదరులు :
తన సోదరి ప్రేమ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోయిన యువతి సోదరులు.. యావన్ పై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే మే 7వ తేదీ రాత్రి.. యావన్ ఎక్కడున్నాడో తెలుసుకున్నారు. యువతి కుటుంబానికి చెందిన ఐదుగురు కలిసి.. యావన్ ను హత్య చేశారు.
యావన్ హత్యలో ఐదుగురు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. వీరిలో పరమేశ్, వంశీ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు. వాళ్ల కోసం మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.
