సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలికా బజార్లో అగ్నిప్రమాదం జరిగింది. అన్ మోల్ సెలెక్షన్..అన్ మోల్ కిడ్స్ వేర్ బట్టల షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. భయానక వాతావరణం నెలకొంది. చుట్టు ప్రక్కల లాడ్జీలకు మంటలు వ్యాపించాయి. దీంతో లాడ్జీ నిర్వాహకులు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
