Dacoit Release : 'డెకాయిట్‌'లో కన్నెపెట్టరో రీమిక్స్ సాంగ్.. రొమాంటిక్ రివెంజ్ థ్రిల్లర్‌ కు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!

Dacoit Release : 'డెకాయిట్‌'లో కన్నెపెట్టరో రీమిక్స్ సాంగ్..  రొమాంటిక్ రివెంజ్ థ్రిల్లర్‌ కు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, అందాల నటి మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'డెకాయిట్‌' (Dacoit). భారీ అంచనాలతో ఈ మూవీ ఏప్రిల్ 10 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌అవుతోంది. శానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ రివెంజ్ థ్రిల్లర్, టీజర్ విడుదలైనప్పటి నుండే సినీ ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీని పెంచేసింది. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

 'రీమిక్స్' వివాదం.. సుఖాంతం!

ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టింట ప్రధానంగా వినిపిస్తున్న చర్చ 1994 నాటి క్లాసిక్ సాంగ్ “కన్నె పెట్టరో కన్ను కొట్టరో”. 'హలో బ్రదర్' చిత్రంలోని ఈ ఐకానిక్ సాంగ్‌ను 'డెకాయిట్‌' కోసం రీమిక్స్ చేశారు. అయితే, తమ అనుమతి లేకుండా ఈ పాటను ఎలా వాడుతారని ఒరిజినల్ కంపోజర్ కోటి అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిరోజులు వివాదం నెలకొంది. లేటెస్ట్ గా అడివి శేష్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. నిర్మాత సుప్రియ యార్లగడ్డ స్వయంగా కోటి గారిని కలిసి సమస్యను పరిష్కరించారని వెల్లడించారు. ఈ పాట సినిమాలో ఒక "లవ్లీ సీన్"లో వస్తుందని, ఫైనల్ కట్‌లో ఇది హైలైట్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్

బాక్సాఫీస్ లెక్కల ప్రకారం, అడివి శేష్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించే దిశగా 'డెకాయిట్‌' దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల ద్వారానే 2,15,000 డాలర్లు వసూలు చేయగా, వీకెండ్ సేల్స్ ఇప్పటికే 4,15,000 మార్కును దాటేశాయి. త్వరలోనే ఇది హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బుక్ మై షో (BMS)లో గత 24 గంటల్లోనే దాదాపు 30 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.

గ్రాండ్ గా రిలీజ్

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, ఎస్.ఎస్. క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో, జ్ఞాని అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రేపు ( ఏప్రిల్ 10న ) ఉదయం 8 గంటల నుండే థియేటర్లలో 'డకోయిట్' సందడి మొదలుకానుంది. ఒకవైపు ఇంటెన్స్ యాక్షన్, మరోవైపు మృణాల్-శేష్ మధ్య కెమిస్ట్రీ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ 'డెకాయిట్‌' ప్రేక్షకుల హృదయాలను ఎంతవరకు కొల్లగొడతాడో చూడాలి.