యాక్షన్ కింగ్ అర్జున్ దర్శక నిర్మాతగా ఆయన కూతురు ఐశ్వర్యను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ‘సీతా పయనం’. కన్నడ స్టార్ ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఉగాది రోజు నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందని టీమ్ తెలియజేసింది. బంధాల విలువ చాటి చెప్పే ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని, ఉగాది నుంచి ఓటీటీకి రావడం ఆనందంగా ఉందని అర్జున్ అన్నారు. ధృవ సర్జా, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
