ఫ్యాషన్ పాఠాలు చెప్తున్న సెజల్

ఫ్యాషన్ పాఠాలు చెప్తున్న సెజల్

యంగ్​ జనరేషన్ ‌‌కి ఫ్యాషన్ పాఠాలు చెప్తుంటుంది సెజల్. అంతేకాదు.. విమెన్​ ఇష్యూష్ మీద వీడియోలు చేసి, యూట్యూబ్ ‌‌లో అప్​లోడ్ చేస్తుంటుంది. యూనిసెఫ్​తో కలిసి చైల్డ్ ప్రొటెక్షన్ క్యాంపెయిన్ చేసింది. ఆమె చేసే ఫ్యాషన్ వ్లాగ్స్​తో పాటు డైలీ వ్లాగ్స్ ‌‌ని చాలా మంది చూస్తుంటారు. 

సెజల్ కుమార్ ఇండియాలో ఫేమస్ యూట్యూబర్. యాక్టర్, ఫ్యాషన్ బ్లాగర్, మోడల్ కూడా. 1995 జనవరి 1న పుట్టిన సెజల్ 2014 ఫిబ్రవరిలో యూట్యూబ్ ఛానెల్​ని మొదలుపెట్టింది. అప్పటికి ఆమెకు19 ఏండ్లు. ఆ తర్వాత ‘ఇంజనీరింగ్ గర్ల్స్​’ అనే వెబ్ సిరీస్​తో యాక్టర్​గా గుర్తింపు తెచ్చుకుంది. పుట్టి, పెరిగింది న్యూఢిల్లీలో అయినా.. ఇప్పుడు ముంబైలో ఉంటోంది. ఢిల్లీలోని మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్​లో చదువుకుంది. తర్వాత న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్​లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 

యాక్టింగ్ అంటే ఇష్టం

నాన్న అనిల్ కుమార్.. రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్. అమ్మ అంజలి కుమార్ గుర్గావ్​లోని ఆర్టెమిస్ హాస్పిటల్​లో గైనకాలజీ డాక్టర్. అదే డిపార్ట్​మెంట్​కు డైరెక్టర్​​గా కూడా పనిచేస్తోంది. సెజల్​ చిన్నప్పటి నుంచే పెద్ద యాక్టర్ కావాలని కలలు కనేది. అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేసింది. చాలాసార్లు ఆడిషన్స్​ కూడా ఇచ్చింది. కానీ.. సెలెక్ట్ కాలేదు. ఆమె మంచి బాస్కెట్​బాల్​ ప్లేయర్. స్కూల్ ‌‌లో చదువుతున్నప్పుడు చాలా పోటీల్లో తన టాలెంట్ నిరూపించుకుంది. డిగ్రీ చదువుతున్నప్పుడు డాన్స్​పై ఎక్కువ దృష్టి పెట్టింది. తర్వాత ‘డాన్స్ ‌‌వర్క్స్​’ సంస్థలో ప్రొఫెషనల్ డాన్సర్​గా కెరీర్ ‌‌ మొదలుపెట్టి రెండేండ్ల తర్వాత మానేసింది. 

నెమ్మది.. నెమ్మదిగా..

‘సెజల్​ కుమార్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టిన తర్వాత మొదటగా ‘సమ్మర్ స్టైల్ టర్కీ’ పేరుతో మొదటి వీడియో అప్​లోడ్ చేసింది. ఆ వీడియో తన ఇంటర్న్​షిప్ ట్రిప్ కోసం టర్కీ వెళ్లినప్పుడు చేసింది. మొదటి వీడియోకు అంత రీచ్ రాలేదు. అయినా నిరాశపడకుండా వీడియోలు చేసింది. ఛానెల్​కు మెల్లమెల్లగా సబ్​స్క్రయిబర్స్​ పెరిగారు. ఇప్పటివరకు దాదాపు 500 వీడియోల వరకు అప్​లోడ్​​ చేసింది. ప్రస్తుతం ఆమె ఛానెల్​కు1.38 మిలియన్ల సబ్​స్క్రయిబర్స్ ఉన్నారు. ఈ మధ్య షార్ట్స్ ఎక్కువగా తీసి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం ఫ్యాషన్, వ్లాగ్స్, సింగింగ్, డాన్స్ లాంటి అంశాలపై వీడియోలు చేస్తోంది. కొన్ని రోజుల నుంచి పాడ్​కాస్ట్స్ కూడా చేస్తోంది. 2018లో వచ్చిన ‘ఇంజనీరింగ్ గర్ల్స్​’లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ‘అజబ్ బిలాల్​కి గజబ్ కహానీ’ అనే షార్ట్​ఫిల్మ్​లో కూడా చేసింది. 

ఆడవాళ్ల ఆరోగ్యం గురించి..

సెజల్​ వాళ్ల అమ్మ అంజలి కుమార్ ‌‌తో కలిసి ‘మైత్రి’ పేరుతో ఒక ఫౌండేషన్ మొదలుపెట్టింది. అదే పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ పెట్టి విమెన్​ హెల్త్ ఇష్యూష్ మీద వీడియోలు చేస్తున్నారు. గైనకాలజిస్ట్​గా 30 ఏండ్ల అనుభవం ఉన్న వాళ్ల అమ్మ ఈ ఛానెల్‌ ద్వారా ఫిమేల్ హెల్త్​పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.

అవార్డులు 

యూట్యూబర్​గా కెరీర్ ‌‌ మొదలుపెట్టిన తర్వాత సెజల్​ ఎన్నో అవార్డ్స్ దక్కించుకుంది. 2018లో ‘కాస్మోపాలిటన్ ఇండియా బ్లాగర్’ అవార్డ్ దక్కించుకుంది. 2019లో ‘ఎగ్జిబిట్ మ్యాగజైన్ అవార్డ్ ఆఫ్ టాప్ 5000 ఇన్​ఫ్లూయెన్సర్స్’​ లిస్ట్ ‌‌లో చోటు దక్కించుకుంది. ‘ఉమెన్ ఆఫ్ స్టీల్ సమ్మిట్’, ‘బెస్ట్ యూత్ ఇన్​ఫ్లూయెన్సర్’ అవార్డులు కూడా అందుకుంది. సెజల్​ అవార్డులతోపాటు డబ్బు కూడా బాగానే సంపాదిస్తోంది. ఇప్పటివరకు యూట్యూబ్​ ద్వారా దాదాపు నాలుగు కోట్ల రూపాయలు సంపాదించింది. ఆమె చేసిన వీడియోలకు ఇప్పటివరకు దాదాపు 250 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.