ఓర్నాయనో.. రోడ్డుపై ట్రక్​ టైరు ఊడింది.. విద్యుత్​ స్థంభాన్ని ఢీ కొట్టి.. ఆ తరువాత..

ఓర్నాయనో.. రోడ్డుపై ట్రక్​ టైరు ఊడింది.. విద్యుత్​ స్థంభాన్ని ఢీ కొట్టి.. ఆ తరువాత..

నేషనల్​ హైవే పై స్పీడ్‌గా వెళ్తున్న ట్రక్కు చక్రాల నుంచి రెండు టైర్లు ఊడిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే వీడియో సోషల్ మీడియాలో అంతే వేగంగా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ వేగంగా వెళ్తున్న ట్రక్కు చక్రాలు ఊడిపోవడంతో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. వివరాల్లోకి వెళ్తే ...

లారీలు.. బస్సులు.. జాతీయ రహదారిపై చాలా స్పీడుగా వెళతాయి.   ఆసయమంలో టైర్లలో సరిపడా గాలి లేకపోతే .... స్పీడ్​ కంట్రోల్​ కాకపోతే పెద్ద ప్రమాదమే జరుగుతుంది.  అదే ఏకంగా జాతీయ రహదారిపై వేగంగా వేగంగా వెళ్తున్న భారీ వాహనానికి టైర్ ఊడిపోతే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కదులుతున్న వాహనం టైరు ఊడిపోవడంతో ఊహించని ఘటన చోటుచేసుకున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డుపై వేగంగా ట్రక్కు దూసుకెళుతుంది. జాతీయ రహదారి అంటే ఒక వాహనమే కాదు కదా.. చాలా వాహనాలు వెళ్తుంటాయి కదా.. అలానే ఆ ట్రక్కు వెనుక ఒక కారు వెళ్తోంది.  డాష్‌బోర్డ్ కెమెరాను  అమర్చబడి ఉండటంతో అక్కడ జరిగిన ఘటన మొత్తం  కెమెరాలో రికార్డయింది. వీడియోలో ఉన్న వివరాల ప్రకారం ... ఈ కారు ముందు వెళ్తున్న ట్రక్కుకు ఉన్న టైర్లలో ఒకటి ఊడిపోయింది.. వాహనం కంటే వేగంగా ఆ టైర్‌ రోడ్డు మధ్యలో పరుగెడుతూ..రోడ్డు అవతలి వైపుకు వెళ్లింది.. డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత లారీ టైరు మరో వైపు వేగంగా దూసుకెళ్లి ..ఏకంగా ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. టైరు ఢీకొనడంతో ఆ స్తంభం విరిగి నేల కూలిపోయింది. అయితే, ఇదంతా చూస్తున్న కారు డ్రైవర్‌ అప్రమత్తతో వెంటనే తన వేగాన్ని తగ్గించాడు. దాంతో అతను ఎటువంటి ప్రమాదానికి గురవకుండా తప్పించుకోగలిగాడు. 

 ఈ ఘటనకు సంబంధించిన వీడియోH0W_THlNGS_W0RK అనే ఖాతా నుంచి ట్విట్టర్​ లో   షేర్​ చేశారు.  హైవేపై నడుస్తున్న ట్రక్కు చక్రాలకు ఎంత పవర్ ఉంటుందో చూశారా అంటూ క్యాప్షన్‌లో రాసి ఉంది. సోషల్ మీడియాలో ఈ వీడియో  వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. .ఒక్క స్తంభాన్ని మాత్రమే కూల్చివేసింది. అదే కారును ఢీకొట్టి ఉంటే కారు ఛిన్నాభిన్నమై ఉండేదని ఓ సోషల్ మీడియా యూజర్ రాశారు. ఇది భారీ చక్రం, దాని బరువు కూడా అంతే ఉంటుందని ఒకరు రాశారు. ఎవరైనా దీనికి ఎదురుపడితే తప్పించుకోవడం కష్టమే అన్నారు. ఇలాంటి సంఘటనలు చాలా ప్రమాదకరమని, చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని మరొకరు రాశారు. ట్రక్కు డ్రైవర్‌పై చర్యలు తీసుకోకూడదని కూడా కొందరు రాశారు. ఇంత జరిగినా ట్రక్కు డ్రైవర్‌ పసిగట్టలేదు. వాహనాన్ని ఆపలేకపోయాడు. అందుకే ఎప్పటికప్పుడు వాహనాన్ని సర్వీసింగ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఒకరు రాశారు.