కేఎఫ్ లైట్ బీర్లు దొరకట్లేదని ప్రభుత్వానికి లేఖ

కేఎఫ్ లైట్ బీర్లు దొరకట్లేదని ప్రభుత్వానికి లేఖ

 మంచిర్యాల జిల్లా: జిల్లాలో కెఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల  అధ్యక్షుడు ప్రభుత్వానికి లేఖ రాశాడు.  మంచిర్యాల జిల్లాతోపాటు కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లోని వైన్స్ లో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకడం లేదని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు  కొట్రంగి తరుణ్ లేఖలో పేర్కొన్నారు. 18రోజుల్లో రాష్ట్రానికి రూ.670 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ శాఖకు అందిచామని అందుకు చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

వేసవిలో కాస్త చల్లబడదామంటే యువకులకు, పెద్దలకు లైట్ బీర్లు ఏ వైన్ షాప్ కు వెళ్లినా దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయాలన్ని పరిగణలోకి తీసుకొని అన్నీ వైన్ షాపుల్లో లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలని లేఖలో కోరారు. అలా చేస్తే ప్రభుత్వ ఆదాయాన్ని ఇంకా రెట్టింపు చేస్తామని  కొట్రంగి తరుణ్ ఎక్సైజ్ శాఖ అధికారులను కోరారు. లైట్ బీర్లలో ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుందని వాటిని తాగి మా పని మేం చేసుకోగలమని ఆయన చెప్పుకొచ్చారు. వేరే బీర్లలో ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుందని వాటిని తాగి ఆరోగ్యం పాడవుతుందని మధ్యంప్రియులు ఆవేదనను తెలిపారు. అన్నీ జిల్లాల్లో కేఎఫ్ లైట్ బీర్ల స్టాక్ ఉండేలా చూడాలని ఈ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.