ఆధ్యాత్మికం: ఇండియాలో వెయ్యేళ్ల గుడి.. అంతా మిస్టరీ.. అన్నీ వింతలే..!

ఆధ్యాత్మికం:  ఇండియాలో వెయ్యేళ్ల గుడి.. అంతా మిస్టరీ.. అన్నీ వింతలే..!

అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు ఆ దేవాలయం వింతలు.. మిస్టరీ గురించి  తెలుసుకుందాం. . .! 

ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయంలో గోడలపై సర్వ దేవతల విగ్రహాలు ఉంటాయి. దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దగా కనిపిస్తాయి. వీరితో పాటూ అష్ట దిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు విగ్రహాలను  కూడా దర్శించుకోవచ్చు. అష్ట దిక్పాలకులు కొలువైన అరుదైన దేవాలయాల్లో బృహదీశ్వరాలయం ఒకటి.  

తంజావూరు బృహదీశ్వరాలయం నిర్మాణాన్ని   క్రీ.శ 1004లో ప్రారంభించి 1009 లో పూర్తి చేసారు. కేవలం ఐదు సంవత్సరాలలో ఇంతపెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణకౌశల్యతకు నిదర్శనం. అవును ఈ ఆలయాన్ని నిర్మించి వేయి సంవత్సరాలయింది. బహు పురాతన ఆలయమిది.. అందుకే ప్రపంచ వారసత్వ సంపద వారు దీనిని రక్షిత ప్రదేశంగా పరిగణించారు...

ఎక్కడా సిమెంట్ అన్నమాటకు తావు లేకుండా ఉక్కు అన్నపదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఈ దేవాలయం 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం.  దాదాపు వేయి సంవత్సరాల క్రితం కట్టిన గుడి.

 భారతదేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న క్షేత్రం.దక్షిణ కాశీగా పేరొందిన ఈ  గుడిలో దాదాపు ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. పెద్ద నంది విగ్రహాన్ని  నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 20 టన్నులు కలిగి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏకశిలా విగ్రహం. 2 మీటర్ల ఎత్తు ,2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. 

దేవాలయంలోని 13 అంతస్థులను గ్రానెట్ రాయితోనే కట్టారు.80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడికే హైలెట్.  ఇక మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము. 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికీ తీసుకెళ్లటమనేది ఆనాటి రాజుల నైపుణ్యానికి ప్రతీక.

ALSO READ : జూన్11 వరకు చాలా ప్రమాదకరం.. ప్రయాణాలు వాయిదా వేసుకోండి..

ఈ ఆలయ ప్రాంగణం  చాలా సువిశాలంగా ఉంటుంది. మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ గుడిని కట్టారు. ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి.వీటి ద్వరా తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు వెళ్లవచ్చని చరిత్ర ద్వారా తెలెస్తుంది.  వీటిలో కొన్ని దారుల్లో వెళితే చాలా ప్రమాదం .  కాని అవి ఏవో తెలియనందున భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అన్ని దారులకు మూసేశారు.

తంజావూరు బృహదీశ్వరాలయం నిర్మాణాన్ని   క్రీ.శ 1004లో ప్రారంభించి 1009 లో పూర్తి చేసారు. కేవలం ఐదు సంవత్సరాలలో ఇంతపెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణకౌశల్యతకు నిదర్శనం. అవును ఈ ఆలయాన్ని నిర్మించి వేయి సంవత్సరాలయింది. బహు పురాతన ఆలయమిది.. అందుకే ప్రపంచ వారసత్వ సంపద వారు దీనిని రక్షిత ప్రదేశంగా పరిగణించారు...

ఒకప్పుడు ఈ మహాలింగం కేవలం రాజు గారు మాత్రమే దర్శించుకునే వారు... సామాన్య జనులకు ప్రవేశం ఉండేది కాదు...తర్వాత  దీనిని సామాన్య జనం కూడా దర్శించుకునేందుకు అనుమతించారు...
 అతి పెద్దదైన ఈ లింగమునకు చేసే పూజలు కూడా ఘనంగా ఉంటాయి.

 ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి... ఇవేవీ ఉపయోగించలేదు.నిర్మాణంపై ఎలాంటి పూతా పూయలేదు. పునాదుల దగ్గర నుంచి పీఠాలు, గోపురం, శిఖరం... ఇలా అన్నీ రాళ్లతోనే తయారయ్యాయి. వాటి బరువుని బట్టి ఒక రాయి మీద మరో రాయిని పేర్చి నిర్మించారు. 

 కేవలం ఈ ఆలయ నిర్మాణం కోసమే చాలా దూరము నుండి గ్రానైట్ రాయిని తెప్పించి రాజా రాజా చోళుడు కాలములో కట్టించినట్లు చరిత్ర చెబుతుంది.  ఈ దేవాలయ ప్రాకారం ఎంత పొడవంటే దాదాపు 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. అంటే నాలుగు ప్రదక్షిణాలు చేస్తే ఒక కిలోమీటరు దూరం నడిచినట్లు...అంటే ఎంత పెద్దగా ఉంటుందో ఇక వేరే చెప్పనక్కరలేదు.

 గుడిలో ఎంత సువిశాలంగా ఉన్న ఇక్కడ ప్రతిధ్వని ఉండదు.. అదే మన ప్రాచీన భారతీయ ఇంజనీర్ల ప్రతిభ. ప్రధాన దేవాలయ గోపురకలశం మొత్తం ఒకే శిలతో రూపుదిద్దుకుని 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినది.అంత ఎత్తుకు ఇంత పెద్ద గోపుర కలశాన్ని వేయి ఏళ్ళ క్రితం ఎలా తీసుకెళ్ళారో చాలా అద్భుతంగా ఉంటుంది...ఈ రాయిని గోపురంపైకి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. గోపురం నుండి ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామం దగ్గర్నుంచి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెనను నిర్మించారు. శిఖరం రెండు తలాలుగా ఉంటుంది. 

తంజావూరు చుట్టుపక్కల ఎక్కడా కొండలు, గుట్టలు కనిపించవు. ఈ రాళ్లను దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకొవై ప్రాంతంలోని రెండు కొండల్ని పూర్తిగా తొలిచి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ఉంటారని ఒక అంచనా.ఈ ఆలయ నిర్మాణమంతా కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పి చే చేయబడినది. ఇప్పటికీ దేశంలో అతి పెద్ద ఆలయంగా దీన్నే చెబుతారు. జీవితకాలంలో ఒక్కసారైనా తప్పని సరిగా చూడవలసిన ఆలయం

అయితే ఇప్పటికీ టెక్నాలజీకి అంతుపట్టని విషయం ఏంటంటే. ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీ మీటర్ల కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం. అవి అలా ఎందుకు పెట్టారు ఇప్పటికీ మిస్టరీనే. ప్రపంచంలోవెయ్యేళ్ల క్రితం కట్టిన   గుడులు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. అయితే  గుడి మాత్రం అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికీ కనిపిస్తుంది...