NEET పేపర్ లీక్పై విద్యార్థుల ఆందోళన.. యువత ఓపిక, నమ్మకం కోల్పోవద్దు.. శిఖర్ ధావన్ పోస్ట్ వైరల్!

NEET పేపర్ లీక్పై విద్యార్థుల ఆందోళన.. యువత ఓపిక, నమ్మకం కోల్పోవద్దు.. శిఖర్ ధావన్ పోస్ట్ వైరల్!

Shikhar Dhawan: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న NEET పేపర్ లీక్ వివాదం.. దీంతో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ ఝలిపించారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో స్పందించారు. ఈ కష్టకాలంలో దేశంలోని యువత, విద్యార్థులు తీవ్ర భావోద్వేగాలకు గురికాకుండా ఓపికగా ఉండాలని, భారతదేశంలోని వ్యవస్థలపై, ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

యువతే దేశ భవిష్యత్తు.. ఓపిక, నమ్మకం కోల్పోవద్దు: 

నీట్ పేపర్ లీక్ వివాదంపై నేరుగా ఎవరినీ విమర్శించకుండా.. విద్యార్థుల భవిష్యత్తును, వారి కలలను దృష్టిలో పెట్టుకుని శిఖర్ ధావన్ ఎక్స్‌లో ఒక సందేశాన్ని షేర్ చేశారు. మన యువతే మన దేశానికి భవిష్యత్తు.. వారి కలలను, ఆకాంక్షలను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం.. అదే సమయంలో, ఇలాంటి క్లిష్ట సమయాల్లో స్టూడెంట్స్ ఓర్పు వహించడం, దేశంలోని వ్యవస్థలపై ప్రభుత్వంపై నమ్మకం పెట్టడం ఎంతో ముఖ్యం అని రాసుకొచ్చాడు. ప్రతి సవాలుకు పరిష్కారం ఓపికతోనే లభిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.. భారతదేశం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంది, ఇకపై కూడా ముందుకు సాగుతూనే ఉంటుందని క్రికెటర్ శిఖర్ తెలిపారు. 

నిరసనల వేళ సోషల్ మీడియాలో వైరల్!

పోటీ పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు, చర్చలు జరుగుతున్న తరుణంలో శిఖర్ ధావన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వ్యవస్థలపై నమ్మకం కోల్పోకుండా, శాంతియుతంగా సమస్యను ఎదుర్కోవాలంటూ ఆయన చేసిన పిలుపు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.