ప్రపంచంలోనే  పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌లు ఇవే: టాప్-10లో ఏ దేశాలు ఉన్నాయంటే ?

ప్రపంచంలోనే  పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌లు ఇవే: టాప్-10లో ఏ దేశాలు ఉన్నాయంటే ?

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లాలన్నా పాస్‌పోర్ట్ చాలా ముఖ్యం. అయితే కొన్ని దేశాల పాస్‌పోర్ట్ జేబులో ఉంటే మాత్రం అసలు వీసా గోలే ఉండదు. ముందస్తు వీసా అవసరం లేకుండానే హ్యాపీగా వందల దేశాల్లో వాలిపోవచ్చు. మరి అంతటి అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు ఉన్న టాప్-10 దేశాలు ఏవో  'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్' లేటెస్ట్ లిస్ట్ ద్వారా వెల్లడైంది.

అగ్రస్థానంలో   'సింగపూర్'

ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా సింగపూర్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. సింగపూర్ పాస్‌పోర్ట్ ఉన్నవారు ఏకంగా 192 దేశాలకు వీసా లేకుండానే డైరెక్ట్ ప్రయాణించవచ్చు.

రెండో స్థానంలో యూఏఈ జోరు!

ఇక రెండవ స్థానంలో ఆసియా దిగ్గజాలైన జపాన్, దక్షిణ కొరియాలతో పాటు ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వచ్చి చేరింది. ఈ మూడు దేశాల పాస్‌పోర్ట్‌లతో 188 దేశాలకు వీసా-ఫ్రీ ఎంట్రీ లభిస్తుంది. ముఖ్యంగా యూఏఈ ఊహించని రీతిలో ముందంజ వేసి టాప్-2లోకి దూసుకొచ్చింది.

టాప్-10లో ఐరోపా దేశాలదే హవా

ఈ లిస్టులో మూడో స్థానం నుంచి తొమ్మిదో స్థానం వరకు ఎక్కువగా యూరోపియన్ యూనియన్ (EU) దేశాలే ఆధిపత్యం చెలాయించాయి.

3వ స్థానంలో స్వీడన్ (స్వీడన్  వీసాతో 187 దేశాలకు ఫ్రీ ఎంట్రీ)

4వ స్థానంలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, ఐర్లాండ్, నార్వే, లక్సెంబర్గ్ వంటి 11 దేశాలు  నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లతో 186 దేశాలకు వెళ్ళిరావొచ్చు.

5వ స్థానంలో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, పోర్చుగల్, గ్రీస్, మాల్టా (185 దేశాలకి వీసా ఫ్రీ ఎంట్రీ) ఉన్నాయి

6వ స్థానంలో  యునైటెడ్ కింగ్‌డమ్ (UK), పోలాండ్, హంగరీ (184 దేశాలకి వీసా ఫ్రీ ఎంట్రీ) ఉన్నాయి

7వ స్థానంలో  ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, మలేషియా, చెకియా, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (183 దేశాలకి వీసా ఫ్రీ ఎంట్రీ)ఉన్నాయి.

8వ స్థానంలో  క్రొయేషియా, ఎస్టోనియా (182 దేశాలకి వీసా ఫ్రీ ఎంట్రీ)ఉన్నాయి.

9వ స్థానం: లిచ్టెన్‌స్టైన్, లిథువేనియా (181 దేశాలకి వీసా ఫ్రీ ఎంట్రీ)ఉన్నాయి.

10వ స్థానానికి పడిపోయిన అమెరికా

ఒకప్పుడు ప్రపంచాన్నే ఏలిన యునైటెడ్ స్టేట్స్ (USA) పాస్‌పోర్ట్ తీవ్ర పోటీ మధ్య 10వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం అమెరికా, ఐస్లాండ్ దేశాల పాస్‌పోర్ట్‌లతో 180 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లే వెసులుబాటు ఉంది. మొత్తానికి అంతర్జాతీయంగా మారుతున్న దౌత్య సంబంధాలు, వీసా విధానాల ఆధారంగా తయారైన ఈ ర్యాంకింగ్స్‌లో ఆసియా, ఐరోపా దేశాలు వాటి బలాన్ని చాటాయి.