జ్యోతిష్యం: ఆకాశంలో అద్భుతం..జూన్ 8, 9 తేదీల్లో కాస్మిక్ కిస్ .. భూమికి దగ్గరగా గురుడు, శుక్రుడు

జ్యోతిష్యం:  ఆకాశంలో అద్భుతం..జూన్ 8, 9 తేదీల్లో కాస్మిక్ కిస్ .. భూమికి దగ్గరగా  గురుడు, శుక్రుడు

 ఆకాశంలో అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతం కానుంది. జూన్ 8, 9 తేదీల్లో  శుక్రుడు , గురుడు  భూమి నుంచి చూసినప్పుడు అత్యంత చేరువగా కనిపించనున్నాయి. వాటి మధ్య వాస్తవానికి కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ, భూమి నుంచి చూసే దృక్కోణం కారణంగా ఒకదానికొకటి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది. 

అంతులేని రహస్యాల ఆకాశంలో జూన్ 8, 9 తేదీల్లో 'కాస్మిక్ కిస్' (విశ్వ చుంబనం) పేరిట అద్భుతం జరగనుంది. ఆ రోజుల్లో పశ్చిమ దిశగా గురుడు, శుక్రుడు  గ్రహాలు అత్యంత పక్కపక్కన కనువిందు చేయనున్నాయి. భూమి నుంచి చూసే కోణం వల్ల ఇవి కేవలం 2 డిగ్రీల వ్యవధిలోనే ఉన్నట్లు కనిపిస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు స్త్రీ...  గురుడు పురుష గ్రహం కావడంతో ఈ కలయికను 'కాస్మిక్ కిస్'గా అభివర్ణిస్తున్నారు.

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..  కర్కాటక రాశిలో గురుడు.. శుక్రుడు సంచరిస్తున్నారు.  ఈ రెండు గ్రహాలు  ఒకదానికొకటి చాలా దగ్గరగా రాబోతున్నాయని పండితులు చెబుతున్నారు.  ఖగోళ శాస్త్రం ప్రకారం లో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఆకాశంలో దగ్గరగా కనిపించడాన్నే ‘ప్లానెటరీ కంజంక్షన్ ..  లేదా గ్రహ సంగమం అని పిలుస్తారు. ఈ అరుదైన దృశ్యం ఆకాశాన్ని వీక్షించే వారికి ఒక అద్భుతమైన అనుభూతిని గురు, శుక్ర గ్రహాల అరుదైన సంగమం మిగిల్చనుంది.

 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం  శుక్రుడిని  స్త్రీ గ్రహమని.. గురుడు పురుష గ్రహమని  పండితులు చెబుతున్నారు. ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు ఒకే రాశిలో కలవడాన్ని పురాతన ఖగోళవేత్తలు ఒక విశేషంగా భావిస్తారు. ‘ప్లానెటరీ కంజంక్షన్ లో  భాగంగా, మనకు కనిపించే అత్యంత ప్రకాశవంతమైన గ్రహాలైన గురు, శుక్రులు జూన్ 8 మరియు 9 తేదీల్లో అత్యంత సమీపంలో కనిపిస్తాయి. ఈ దృశ్యం సాధారణ కంటితో కూడా స్పష్టంగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమి నుంచి చూసినప్పుడు ప్లానెటరీ కంజంక్షన్ లో  భాగంగా గ్రహాలు పక్కపక్కనే ఉన్నట్లు అనిపించినప్పటికీ, అంతరిక్షంలో వాటి మధ్య కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది కేవలం మన దృష్టి కోణం  వల్ల ఏర్పడే భ్రమ మాత్రమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశ్వంలో గ్రహాల కక్ష్యలు, వేగం మరియు సూర్యుడి చుట్టూ అవి తిరిగే మార్గాల కారణంగా ఇటువంటి అరుదైన సంఘటనలు సంభవిస్తుంటాయి. 

ఈ దృశ్యాన్ని ఎలా చూడాలి?

ప్లానెటరీ కంజంక్షన్   దృశ్యాన్ని స్పష్టంగా చూడటానికి కాంతి తక్కువగా ఉన్న ప్రదేశాలను ఎంచుకోవడం ఉత్తమం. టెలిస్కోప్ లేకపోయినా, ఈ గ్రహాల ప్రకాశం వల్ల సాధారణ కంటితోనే వాటిని గుర్తించవచ్చు. జూన్  8,9 తేదీల్లో  సంభవించే ఈ అరుదైన ఖగోళ విన్యాసాన్ని చూసేందుకు ఆకాశం నిర్మలంగా ఉండాలి.

 ప్రకృతి ఇచ్చే ఇలాంటి అద్భుతమైన అవకాశాలను అస్సలు వదులుకోకండి. భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయని, ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే తమ అంచనాలను విడుదల చేశారు. 

ఎంత సేపు చూడొచ్చు

ఈ అద్భుతాన్ని జూన్8.  9 తేదీల్లో  సూర్యాస్తమయం తరువాత  అరగంట సేపు  పశ్చిమ-వాయువ్య దిశలో కపడడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే  ఈ దృశ్యాన్ని ఎక్కువ సమయం కనపడదు. ఎందుకంటే క్రమంగా హోరైజన్‌కు దగ్గరవుతూ గ్రహాలు అస్తమించిపోతాయి. అందువల్ల దాదాపు గంట పాటు మాత్రమే చూసే అవకాశం ఉంటుందని చెబడుతున్నారు. టెలిస్కోప్ అవసరం లేకుండానే శుక్రుడు, గురుడు మన కంటికి స్పష్టంగా కనిపించేంత ప్రకాశవంతంగా ఉంటాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని  జ్యోతిష్య,ఖగోళ  నిపుణుల సలహాలతో పాటు  ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం