ఎంపీపై వంశీకృష్ణపై అసత్య ప్రచారాలు మానుకోవాలి : వొడ్నాల శ్రీనివాస్

ఎంపీపై వంశీకృష్ణపై అసత్య ప్రచారాలు మానుకోవాలి : వొడ్నాల శ్రీనివాస్

కోల్​బెల్ట్, వెలుగు: ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం మాట్లాడలేని బీజేపీ లీడర్లు.. వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలతో కాలక్షేపం చేస్తున్నారని మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి టౌన్ కాంగ్రెస్​ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం రామకృష్ణాపూర్​లోని కాంగ్రెస్ ఆఫీస్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు.పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతం అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోతో ప్రజల మధ్య తిరుగుతూ రాజకీయలబ్ధి కోసం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్​గౌడ్, పార్టీ లీడర్ల​ వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉందన్నారు.

అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులపై బీజేపీ లీడర్లు అసత్య ప్రచారాలు, బురదజల్లే ప్రయత్నాలను  ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. జగిత్యాల–మంచిర్యాల హైవే- ఫోర్​లేన్ల విస్తరణకు రూ.2,700 కోట్లు, పెద్దపల్లి–మణుగూరు రైల్వే ప్రాజెక్టుకు రూ.4,500 కోట్లు, ఆర్వోబీలు, ఎఫ్​వోబీల నిర్మాణానికి రూ.500 కోట్లతో పాటు, అభివృద్ధి కోసం అనేక నిధులు తీసుకొస్తున్న ఎంపీపై అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. కౌన్సిలర్లు మల్లేశ్, ప్రభాకర్, పార్టీ టౌన్​ వైస్​ ప్రెసిడెంట్​బి.శ్రీనివాస్, జనరల్​ సెక్రటరీలు రాజం, వేణు, సత్యనారాయణ, సురేందర్, మైనార్టీ ప్రెసిడెంట్అఫ్జల్​ లాడెన్ తదితరులు పాల్గొన్నారు.