విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో వేసవి సెలవులు పొడగింపు

విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో వేసవి సెలవులు పొడగింపు

హైదరాబాద్: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవులను 2026, జూన్ 14 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదివారం (జూన్ 7) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 2026, జూన్ 15న రీ ఓపెన్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.  

2026-27 విద్యా సంవత్సరానికి గానూ ముందుగా నిర్ణయించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026, జూన్ 12వ తేదీన తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉంది. కానీ జూన్ 13 రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో స్కూళ్లు రీ ఓపెన్ అయిన వెంటనే వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో స్కూళ్లను జూన్ 15 నుంచి పునః ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

ఈ విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వేసవి సెలవులను జూన్ 14 వరకు పొడగించింది. దీంతో 2026, జూన్ 15 నుంచి తెలంగాణలో పాఠశాలలు రీ ఓపెన్ కానున్నాయి. జూన్ 13 రెండో శనివారం సెలవుకు బదులుగా 2026, జూలై 11 (రెండో శనివారం) వర్కింగ్ డేగా ఉంటుందన్న విద్యా శాఖ ప్రకటించింది.