ఒకపక్క యుద్ధంతో మార్కెట్లు హీటెక్కిపోతోంటే మరోపక్క బంగారం, వెంటి రేట్లు మాత్రం క్రమక్రమంగా కిందకు దిగివస్తున్నాయి. గడచిన వారం రోజులుగా దాదాపు ప్రతిరోజూ బంగారం వెండి ధరలు తగ్గటం భారతీయ కొనుగోలుదారులకు భారీ ఊరటను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు ముందుగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
జూన్ 8న బంగారం రేట్లు తగ్గాయి. జూన్ 7 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.104 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 169గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 905గా కొనసాగుతోంది.
ALSO READ : ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మెుదలైన దాడులు.. కుప్పకూలిన మన స్టాక్ మార్కెట్లు..
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 8, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి ఎలాంటి మార్పులు లేకుండా రూ.2లక్షల 70వేలుగానే కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.270 దగ్గర ఉంది.
