Mirabai Chanu: గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను మరోసారి సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల 48 కేజీల ఫైనల్లో స్నాచ్ విభాగంలో ఏకంగా 85 కేజీల బరువును ఎత్తి సరికొత్త కామన్‌వెల్త్ రికార్డు నమోదు చేసింది. పోటీల ఆరంభంలో 82 కేజీలు ఎత్తే తొలి ప్రయత్నంలో విఫలమైనప్పటికీ, రెండో ప్రయత్నంలో మాత్రం 82 కేజీలను విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత తన చివరి ప్రయత్నంలో 85 కేజీల బరువును ఎత్తి కామన్‌వెల్త్ రికార్డులను బ్రేక్ చేసింది. మీరాబాయి చాను గతంలో 2018, 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో కూడా స్వర్ణ పతకాలను సాధించింది.&
Queen of RECORDS! 🏋️
— Sony Sports Network (@SonySportsNetwk) July 26, 2026
𝐆𝐨𝐥𝐝 𝐦𝐞𝐝𝐚𝐥. 𝐆𝐚𝐦𝐞𝐬 𝐑𝐞𝐜𝐨𝐫𝐝𝐬! 👑
Mirabai Chanu stamps her authority on the 48kg class with a dominant show at the Commonwealth Games Glasgow 2026.
Watch Glasgow 2026, LIVE NOW exclusively on Sony Sports Network TV channels and Sony LIV.… pic.twitter.com/sHxwKkj7cI
nbsp;
రిషికాంత్ సింగ్‌కు రజత పతకం.. కామన్‌వెల్త్ రికార్డు నమోదు:
పురుషుల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ చనంబమ్ రిషికాంత్ సింగ్ మొత్తం 264 కేజీల (121 కేజీల స్నాచ్ + 143 కేజీల క్లీన్ అండ్ జెర్క్) బరువును ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. స్నాచ్ విభాగంలో 116 కేజీలతో శుభారంభం చేసిన రిషికాంత్, ఆ తర్వాత 119 కేజీలు, చివరి ప్రయత్నంలో 121 కేజీల బరువును మాత్రమే విజయవంతంగా ఎత్తి కామన్‌వెల్త్ గేమ్స్ స్నాచ్ రికార్డుతో పాటు తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు.
మలేషియా ప్లేయర్‌కు స్వర్ణం.. కెన్యాకు కాంస్యం
మలేషియాకు చెందిన మహమ్మద్ అనిక్ కాస్దాన్ స్నాచ్‌లో 121 కేజీలు ఎత్తి రిషికాంత్ సరసన నిలిచాడు. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో వరుసగా 145 కేజీలు, 149 కేజీలు, చివరగా 152 కేజీలు ఎత్తి మొత్తం 273 కేజీల ఆల్‌టైమ్ రికార్డు స్కోరుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత లిఫ్టర్ రిషికాంత్ క్లీన్ అండ్ జెర్క్‌లో మొదట 143 కేజీలు ఎత్తి ఆధిక్యంలో నిలిచినా, చివరి ప్రయత్నంలో 151 కేజీల బరువు ఎత్తడంలో జెర్క్ మూవ్‌మెంట్ దగ్గర విఫలమవ్వడంతో స్వర్ణ పతక పోరు ముగిసింది. ఇక కెన్యాకు చెందిన జోషువా ఎంబోయా మొత్తం 260 కేజీల (115 కేజీల స్నాచ్ + 145 కేజీల క్లీన్ అండ్ జెర్క్) బరువు ఎత్తి కాంస్య పతకం సాధించాడు.
