మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన రీసెంట్ మూవీ ‘గేదెల రాజు’. చైతన్య మోటూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మర్డర్ మిస్టరీతో తెరకెక్కింది. ‘‘చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు’’ అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే, ఈ మూవీ రూపొందింది. ఇపుడు ఈ రూరల్ రస్టిక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీకి వచ్చి దుమ్మురేపుతోంది.
ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం జూలై 17 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ అలరిస్తుంది. ఇందులో రఘు కుంచెతో పాటుగా శ్రీకాంత్ అయ్యంగార్, వికాస్ ముప్పాల, తీనా శ్రావ్య, రవి ఆనంద్ చిన్నబిల్లి, మౌనిక కలాపాల కీలక పాత్రలు పోషించారు.
కథేంటంటే:
భగవాన్ రాజు అలియాస్ గేదెల రాజు (రఘు కుంచె), దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్) ఒకప్పుడు ఫ్రెండ్స్. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా మారుతారు. గేదెల రాజు కార్పొరేటర్ కావాలని ఆశపడతాడు. అతని ప్రయత్నాలకు దుర్గ అడ్డుపడుతుంటాడు. ఇక ఆ ఊళ్లో ఎక్కువగా వినిపించే పేరు రిచ్. రిచ్ తన చెల్లెలి ఫ్రెండ్ మీరా (మౌనిక)ను ప్రేమిస్తాడు. భర్తను కోల్పోయిన మీరా తల్లి, గేదెలరాజుతో సన్నిహితంగా ఉంటుంది. ఇక గతంలో గేదెలరాజుతో కలిసి పనిచేసిన శివయ్య, అతని కారణంగా జైలుకి వెళ్లొస్తాడు. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇదిలా ఉంటే సడెన్‌గా గేదెలరాజు హత్యకు గురవుతాడు. హంతకుడు ఎవరు? హత్యకు గల కారణలేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
►ALSO REA D | Chennai Love Story Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’
#TMSRUpdates #TMSRUOTTUpdates 📱
— TMSRUpdates ❁ (@TMSRUpdates) July 16, 2026
A murder that shook Kakinada.
A list of suspects with secrets.
And one question that demands an answer… 👀
Who killed #GedelaRaju
Streaming from July 17, only on @ahavideoIN#MoturiChaitanya #RaghuKunche#SekharKumpatla #VRaju pic.twitter.com/ouML3r5Lh5
రఘు కుంచె విశ్వరూపం..
ఈ సినిమాకు అసలైన బలం, ప్రాణం రఘు కుంచె. ఒక రౌడీ షీటర్‌గా ఆయన మేకోవర్, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి యాసలో ఆయన పలికించిన డైలాగులు థియేటర్లో ఈలలు వేయిస్తాయి. ఒక వైపు కరుడుగట్టిన రౌడీగా కనిపిస్తూనే, మరోవైపు రాజకీయ ఆకాంక్షలు ఉన్న వ్యక్తిగా ఆయన చూపిన హావభావాలు సినిమాను నిలబెట్టాయి. రఘు కుంచె కెరీర్‌లో ఇది ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు.
