మోటోరోలా తమ కొత్త 5జీ ఆండ్రాయిడ్ టాబ్లెట్ 'మోటో ప్యాడ్ 70' ను ఇండియాలో ఆగస్టు 9న లాంచ్ చేస్తామని ప్రకటించింది. ఈ టాబ్లెట్‌లో 12.1 అంగుళాల డిస్‌ప్లే, 2.5కే రెజల్యూషన్, 800 నిట్స్ బ్రైట్‌నెస్ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ ఉన్నాయి.
భారీ 10,200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. 68 వాట్ టర్బో పవర్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టాబ్లెట్‌ను కొనుక్కోవచ్చు. ఉచితంగా మోటో పెన్ లభిస్తుంది.
